in , ,

ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి-నిర్మల్ జిల్లా ఎస్పీ

దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి.
ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా నవరాత్రి ఉత్సవాలను సామరస్యంగా నిర్వహించుకోవాలి.
రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి- జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు

జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ గారు నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో నమోదు అయిన కేసులలో అధికారులు పకడ్బదీగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని, అందుకు అవసరమైన సాంకేతిక ప‌రిజ్ఙానం విరివిగా ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులకు తెలియజేశారు.  ముందుగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, UI కేసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ… మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలలో పకడ్బదీగా విచారణ చేసి నిందితుల పై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కేసులు విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను ఇతర శాఖల అధికారులతో సంప్రదించి పట్టిష్టంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి కేసు విచారణలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టుట, పార్ట్-1, పార్ట్-2 స్టేట్మెంట్ రికార్డ్, CDF ఫీల్ చేయుట, పోటోస్ , ప్రాపర్టీ సీజ్, నిందితుల వివరాలు ఎంట్రి చేయట, రిమాండ్ డైరీ చార్జి షీట్ ఫీల్ చేయుట తదితర అంశాల పై ఆయా కేసులలో ఫైల్ లను పరిశీలించి SHO లకు తగు సూచనలు చేశారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ అమాయకపు ప్రజల నగదును సునాయాసంగా దోచుకుంటున్నారు. జిల్లా ప్రజలందరికీ సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరం బారినపడి నగదును కోల్పోయిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్, బీట్స్ ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు. బెట్టింగ్, మట్కా, గంజాయి రవాణా లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని తెలియజేసారు. వర్టికల్ కు సoబందించి సిబ్బంది పనితీరును రోజు వారిగా సమీక్షించుకోవాలని ఎస్సై లకు సూచించారు. నేరాల నియంత్రణలో చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి "నేను సైతం" కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, చేపట్టవలసిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి. ఎలక్షన్ల  ముందు ఆ సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి. ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయంతో సాఫీగా ఎన్నికలు సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెల్పినారు. ఈ సంర్బంగా విధుల పట్ల ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సమీక్షా సమావేశంలో భైంసా ఏఎస్పీ శ్రీ.కాంతిలాల్ పాటిల్, డి.ఎస్పి రాంరెడ్డి, డీసీఆర్బి రవీందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ లు కాశీనాథ్, రవీందర్ నాయిక్, సి.ఐలు పురషోతం చ్యారి, శ్రీనివాస్, మోహన్, వినోద్, నవీన్ కుమార్, నైలు, ఐటీ సెల్ ఆర్ఎస్ఐ రవి కుమార్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ సెల్, సిబ్బంది ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

చంద్రబాబు వందశాతం అవినీతి చేశారు: కేకే పాల్

బీజేపీ లోకి భారీగా చేరికలు…..