in , ,

ప్రభుత్వ వైద్యశాలకు రండి.. ప్రైవేటుకి వెళ్ళి డబ్బు వృధా చేసుకోవద్దు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండలం చీమలపాడు గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ గత కొద్ది రోజుల క్రితం జ్వరానికి మండల కేంద్రంలోని సీమాంక్ సెంటర్లో వైద్యం చేయించుకున్నాడు.అతడికి నయమవగానే ప్రభుత్వ ఆసుపత్రిలో అతడికి అందించిన వైద్య సేవలకు కృతజ్ఞతగా ఆసుపత్రికి డిజిటల్ బి.పి మీటర్ ను,ఒక వాటర్ క్యాన్ ను వితరణగా అందించాడు.ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ జగన్ ఆనందం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

YSRCP కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు భూ ఆక్రమణ నుండి ఆదివాసీలకు రక్షణ కల్పించాలి

స్త్రీల త్యాగాలు ఎనలేనివి -సోనియా గాంధీ