భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు సవరణ క్యాంపుల్లో 7916 నూతన ఓటర్లు, 1359 తొలగింపునకు, 3426 మార్పులు, చేర్పులకు దరఖాస్తులు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. 1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు నూతన ఓటరుగా నమోదు కావడం, మరణించిన ఓటర్లును ఓటరు జాబితా నుండి తొలగించడం, పోలింగ్ కేంద్రం లేదా ఇల్లు మారిన ఓటరు చిరునామా మార్పు కొరకు ఎన్నికల సంగ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు
నిర్వహించినట్లు చెప్పారు. ఇట్టి ప్రత్యేక క్యాంపులకు మంచి స్పందన వచ్చిందని, పెద్దఎత్తున ఓటర్లు నమోదు జరిగినట్లు చెప్పారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓటు హక్కుకు కల్పనలో బాగంగా నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో బాగస్వాములైన
ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందించారు.
గత నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో నూతన ఓటరు నమోదుకు 4041, తొలగింపుకు 557, మార్పులు చేర్పులకు 1820 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక క్యాంపుల్లో వచ్చిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల సంగ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు, తహసిల్దారులకు సూచించారు. గత నెల 21వ తేదీన ప్రకటించిన ఓటరు జాభితాను ప్రతి ఓటరు పరిశీలించుకోవాలని, అట్టి జాబితాలో ఏమైనా అబ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీ వరకు తెలియచేయాలని పేర్కొన్నారు.
[zombify_post]


