in ,

ప్రజాప్రతినిధులే నిలదియ్యాలి

===కేసీఆర్ సహకారం లేకుండా ఎవరూ ఏమీ చెయ్యలేదు.

===కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టాలి.

=== సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక అనుమతి

===సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

బోగస్ కరపత్రాలతో ముఠాలుగా నియోజకవర్గంలో, జిల్లాలో తిరుగుతున్న వారిని ప్రజాప్రతినిధులే నిలదియ్యాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన సమయంలో, ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎక్కడైనా అమలయ్యాయా అని ప్రశ్నించారు. ఆదివారం స్థా నిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. 2019 నుంచి 2023 వరకు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 5001 మందికి గానూ రూ.25,26,96,901 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్దిదారులకు చెక్కుల రూపంలో అందించినట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న తెలం "గాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ క్రమంలో నిరుపేదలకు మెడికల్ సీట్లు పొందగలిగారన్నారు. ఎన్నికలు, రాజకీయ లబ్దికోసం నిబద్దత, సిద్దాంతం లేని కాం గ్రెస్ ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. 5 గ్యారంటీ పథకాలంటూ కరత్రాలతో ఇంటింటికి తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులే నిలదియ్యాలని, ఎప్పుడూ రానివారి, ఏ పథకాలు అమలు చెయ్యలేని వారు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం లేనిదే ఎవరూ కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెయ్యలేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రానికి మనకు అభివృద్ధిలో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని. ఈ క్రమంలో ఇంటింటికి కేసీఆర్ అందిస్తున్న పథకాలను మనమే ప్రచారం చేయాల్సి ఉందన్నారు. ర ణమాఫీలో ఏర్పడిన సాంకేతిక కారణాలను కలెక్టర్తో చర్చించానని, త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. దళితుల ఆర్ధికాభివృద్ధి నేపథ్యంలో కేసీఆర్ హృదయం నుంచి పుట్టుకొచ్చిందే దళితబందు పథకమని, తప్పుడు పద్దతులలో ప్రతిపక్షాలు ఈ పథకాన్ని ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 

=== సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో గృహలక్ష్మీ పథకం

త్వరలోనే గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గంలో లబ్దిదారుల పరిశీలన పూర్తయిందని, సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో ఈ పధకాన్ని పైవాటితో సంబంధం లేకుండా అమలు చేసేందుకు ప్రభుత్వం మ ఎందుకు వచ్చిందన్నారు. అదేవిధంగా ఇళ్లు దగ్ధమైన వారు, పూరి గుడిసె, అత్యంత నిరుపేదలను ఈ పధకంలో చేర్చి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కూసంపూడి వ మహేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మోనార్క్ రఫీ, అంకంరాజులతో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై సుధాకర్*

అరెస్ట్ తరువాత పోలీసుల వలయంలో చంద్రబాబు