in , , ,

పోషణ్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

  • పోషన్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి..

  • గర్భిణీలు,బాలింతలు పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించాలి.

  • ప్రతి అంగన్వాడీ ద్వారా మెరుగైన సేవలు అందాలి.

  • జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.

జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు అందాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

 సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ్ మహోత్సవం నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ.వెంకట్ రెడ్డి లతో కలసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణి స్త్రీలు, బాలింతలు అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, బలవర్ధకమైన పౌష్టికాహారం  అందించాలని అన్నారు.  పిల్లలకు సకాలంలో ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలని అలాగే   పోషణ మాసోత్సవంలో భాగంగా ఈ నెల 30 వరకు షెడ్యూల్ ప్రకారం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం అనుబంధ శాఖల అధికారులు కలసి సమిష్టి కృషి చేయాలని సూచించారు. 

పోషణ్ మాహోత్సవాలలో భాగంగా పిల్లల ఎత్తు బరువులు పరిశీలన అనంతరం తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు, వయసుకు తగ్గ ఎత్తు, బరువు లోపం ఉన్న పిల్లలను గుర్తించి, గుడ్లు బాలామృతం అందేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ముక్యంగా  పోషక విలువలు కలిగి ఉన్న చిరుధాన్యాల పట్ల వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కల్పించాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని  జ్యోతి పద్మ  పోషణ మాసంలో  అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వివరించడం జరుగుతుందని  మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు తప్పక అందించాలని అలాగే  ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం  అందించడం జరుగుతుందని తెలిపారు.

ఆరోగ్యకరమైన పిల్లల పోషణతో పాటు చదువుపై కృషి చేస్తున్నామని అన్నారు. మిషన్ లైఫ్ ద్వారా పోషకాహారాన్ని మెరుగుపరచడం జరుగుతుందని వివరించారు.గిరిజన ప్రాంతాలలో పోషకాహారం పై ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందని,కిషోర బాలికలలో రక్తహీనత పై అవగాహన, రోజువారి చేపట్టే పోషణ మాస కార్యక్రమాలలో ఆశ, ఏఎన్ఎం, పంచాయతీ సెక్రెటరీ, స్వయం సహకార సంఘ సభ్యులు , అంగన్వాడీ టీచర్స్ చురుకుగా పాల్గొని సమతుల ఆహారానికి పాలు, గ్రుడ్లు  చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించారు.

అనంతరం అధికారులతో కలిసి పోషణ్ మా గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్, డిఏఓ రామారావు నాయక్,డిఎంఅండ్ హెచ్ ఓ హర్షవర్ధన్,మున్సిపల్ కమిషనర్ సూర్యాపేట రామానుజుల రెడ్డి ,డీఈఓ అశోక్,డిఎస్సిడిఓ దయానంద రాణి, డి సి ఎస్ ఓ మోహన్ బాబు, డిటిడిఓ శంకర్,డిపిఓ యాదయ్య,డివైసిఈ ఇరిగేషన్ ప్రేమ్ చంద్, డిఎంసిఎస్ రాంపతి నాయక్,డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాధవ రెడ్డి , డిఎండబ్ల్యూ ఓ జగదీశ్వర్ రెడ్డి  పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

గ్రీవెన్స్ కు 152 వినతులు”*

అరుణ్ రెడ్డి కి శ్రద్ధాంజలి