in

పోషకా ఆహారంతోనే రక్తహీనత రాకుండా ఉంటుంది – సూపర్వైజర్ బ్లాండిన

 పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తున్న సర్పంచ్ సిరుకంటి శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్ బ్లాండిన టీచర్ ఒక్కం మలిత 

ధర్మారం మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో అంగన్వాడి 1, 2 వ సెంటర్లో గురువారం నాడు నిర్వహించిన  పోషకా మాసం సందర్భంగా సూపర్వైజర్ కె.బ్లాండిన  ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సురకంటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని, పిల్లలకు అన్నప్రసాన అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అనంతరం పోషక మాసం ప్రతిజ్ఞ చేసిన తరువాత సూపర్వైజర్ బ్లాండిన మాట్లాడుతూ, పోషక ఆహారం గురించి తల్లులకు వివరించడం జరిగింది, పాలు పండ్లు ఎగ్గు ఆకుకూరలు పప్పులు, కూరగాయలు ఆహారం ఎక్కువ తీసుకోవాలని అన్నారు పల్లీలు నువ్వులు బెల్లం , అలాగే నూనె నెయ్యి ప్రతి రోజు ఆహారంలో మిల్లెట్స్ , వంటివి అంగన్వాడీ కేంద్రాలలో  ఇచ్చే బాలామృతం అన్నింటిని  గర్భిణీ లు బాలింతలు పిల్లలు తీసుకోవాలి, అన్నారు ఈ ఆహారం పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వలన  పిల్లల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడతాయి  అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు రొక్కం మలిత,  జె. వరలక్ష్మి, ఆశా వర్కర్లు కే అరుణ, గర్భిణీ స్త్రీలు తల్లులు  తదితరులు పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి

ఓబిసి బిల్లు అమలు చేయాలి