in ,

పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

విశాఖపట్నం:ఎస్.ఎల్.పి.ఆర్.బి ఆధ్వర్యంలో నిర్వహించు స్టైపెండరీ  క్యాడెట్ ట్రైనీ  ఎస్ఐ/ ఆర్ఎస్ఐ ల  పోలీసు నియామక ప్రక్రియ లో భాగంగా, విశాఖపట్నం రేంజ్ కు సంబంధించి  ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 800 మంది అభ్యర్ధులకు దేహదారుడ్య (ఫిజికల్ మెజర్మెంట్ & ఫిజికల్ ఎఫిషియన్సీ) పరీక్షలను కైలాసగిరి ఆర్మ్డ్  రిజర్వ్ పోలీస్ మైదానంలో సోమవారం నిర్వహించారు . విశాఖపట్నం రేంజ్ డీఐజీ .హరికృష్ణ , విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక పాటిల్  పర్యవేక్షించారు .  మొత్తం 800 మందికి గాను 614 మంది హాజరైట్లు వారు వెల్లడించారు.
దేహదారుఢ్య  పరీక్షలకు హాజరవు అభ్యర్థులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించిన,కనీస విద్యార్హతకు సంబంధించిన, కుల ధ్రువీకరణకు సంబంధించిన, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తర్వాత తీసుకున్న  నాన్ క్రిమిలేయర్, అబారిజన్ ఎస్టి అయితే వాటికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటేస్టేడ్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు 1600 మీటర్స్ రన్, తదనంతరం  1600 మీటర్స్ రన్ లో  క్వాలిఫై అయిన అభ్యర్థులకు 100 మీటర్స్ రన్  మరియు లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మరియు నోడల్ ఆఫీసర్ దిలీప్ కిరణ్,  ఏ.ఆర్ డీఎస్పీ  పి.నాగేశ్వరరావు ఇతర అధికారులు, మినిస్ట్రీయల్ సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఆశ వర్కర్లను రెగ్యులరైజ్ చేయలని కలెక్టరేట్ ముందు నిరసన..

ఈనెల 15లోగా ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయండి. కలెక్టర్ సుమిత్ కుమార్