in

పినపళ్ళ గ్రామంలో వైభవంగా గంగాలమ్మ తీర్థ మహోత్సవములు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గ్రామదేవత చల్లని తల్లి కల్పవల్లి శ్రీశ్రీశ్రీ గంగాలఅమ్మవారి తీర్థ మహెూత్సవంలు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పినపళ్ళ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిం చారు. ఈ జాతర మహోత్సవానికి కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బండారు శ్రీనివాస్ ను సంగిత సుభాష్ దృశలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ వారు గ్రామస్తులను చల్లగా చూస్తూ ప్రజలను అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉండేలాగా చేయాలని గ్రామదేవత కృప కటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తాళ్ల డేవిడ్ రాజ్,పినపళ్ళ గ్రామ ఉపసర్పంచ్, యనమదల రాణి శ్రీనివాస్, ఒక్కపట్ల లచ్చి బాబు,జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నామల సుబ్బారావు, విస్స పుల్లయ్య, పెరబత్తులు రాజేష్ ,కొత్తపల్లి నగేష్, తొరాటి సూరిబాబు, ఆలయ కమిటీ సభ్యులు,జన సైనికులు తదితరులు పాల్గొన్నారు._

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్…

balakrishna

chandrababu | Balakrishna: బాలకృష్ణ ఓదార్పు యాత్ర