పాము కరవడంతో రైతుకు అస్వస్థత
కురుపాం మండలం కస్పాగదబవలస గ్రామంలో మంగళవారం పాముకరవడంతో రైతు అస్వస్థతకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గొర్లి ఈశ్వరరావు తన పొలంలో పత్తి మొక్కలకు గాబు తీస్తుండగా ఉల్లిపాము కాలుపై కరిచింది దాంతో అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన కురుపాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
[zombify_post]

