in ,

పామాయిల్ లోడింగ్ ను అడ్డుకున్న కూలీలు

లోడింగ్ ను అడ్డుకున్న పామాయిల్ కూలీలు

—కూలీ రేట్లు పెంచాలంటూ రేగళ్లపాడు నర్సరీ వద్ద ఆందోళన

పామాయిల్ నర్సరీ లోడింగ్ కూలీ పెంచాలంటూ కూలీలు ఆందోళన చేపట్టిన సంఘటన సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో చోటుచేసుకుంది. పామాయిల్ నర్సరీలో దినసరి కూలీలు శిరీష శాంతి, విమల, గురువర్ణ, నందిని, దుర్గ, వాసంతి, పోచమ్మ, లక్ష్మీప్రసన్న, నాగమణి, వాణీ, సోమమ్మ, నాగేంద్రబాబు, బానుమతి, సావిత్రి, సత్యవతి. తదితరులు తెలిపిన వివరాల ప్రకారం తామంతో రూ.400కూలీకి ఇక్కడ నర్సరీలో కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ బ్యాగ్ ఫిల్లింగ్, సీడ్, మొక్కల సంర క్షణ, కలుపు తీయడం తదితర పనులను చేస్తుంటామని, మొక్కల లోడింగ్ సమయంలో వాహనాలను ఎక్కిస్తామని తెలిపారు. అయితే మొక్కల కోసం ట్రాక్టర్తో వచ్చే రైతుల వద్ద నుంచి కూలీల ఖర్చుల కోసం అని చెప్పి రూ.400 వసూలు చేస్తుండగా తమకు రూ.50 మాత్రమే కాంట్రాక్టర్ ఇస్తున్నారని వాపోయారు. అదేవిధంగా గతేడాది రూ.500 దినసరి కూలీగా ఇచ్చిన కాంట్రాక్టర్ కొద్ది నెలలుగా రూ.400మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాత్రం కూలీలకు రూ.500తో పాటు ట్రాక్టర్ లోడింగ్ సమయంలో రూ.100 ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారని, తమకు అదేవిధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పామాయిల్ మొక్కల లోడింగ్ను కూలీలు అడ్డుకున్నారు. 

-ఇబ్బందులు పడ్డ రైతులు

అయితే మొక్కల కోసం ట్రాక్టర్లతో వచ్చిన దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన రైతులు మొడియం వీర్రాజు, వాసం రమేష్, జారే వెంకటేష్, కొర్సా వెంకటేష్తో పాటు మరో 20 మంది రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా ఇబ్బందులు పడ్డారు. నర్సరీలో కనీసం తాగునీటితో పాటు వసతి సదుపాయం లేదని, భోజనం కూడా చెయ్యకుండా ట్రాక్టర్లలో మొక్కలను లోడింగ్ చేసుకున్నామని వాపోయారు. అయితే తమవద్ద రూ.400 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ కూలీలకు రూ.50 మాత్రమే ఇసు న్నారంటూ లోడింగ్ను అడ్డుకున్నారు. కూలీల ఆందోళన తెలుసుకున్న నర్సరీ ఇంచార్జీ, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ నర్సరీ వద్దకు చేరుకుని కూలీల సమస్యలను తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని తనకు ఎందుకు చెప్పలేదని, సమస్యలు అందరికీ ఉంటాయని, డబ్బులు ఇచ్చే వరకు పన మలు చేయకపోతే కాంట్రాక్టర్ తప్పక ఇతర ప్రాంతాల నుంచి రైతుల కోసం కూలీలను తెచ్చుకుని పనులు చేయుంచుకోక తప్పదని తెలిపారు. అయితే తమకు కూలీ రేట్లు పెంచాల్సిందేనని. అప్పటి వరకు ట్రాక్టర్లను కదలనివ్వమంటూ కూలీలు సాయంత్రం వరకు అడ్డుకున్నారు.

[zombify_post]

Report

What do you think?

పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం*

అవయవదానంతో ఏడుగురి ప్రాణాలు కాపాడిన యువతి..