in ,

పసుపు ధర పెరగడంతో గిరి రైతులు ఆనందం

అల్లూరి జిల్లా పాడేరు మన్యం పసుపు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేజీకి రూ.50 వరకు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పాడేచరు డివిజన్‌లోని 11 మండలాల్లో 15 వేల ఎకరాల్లో ఈ సాగు విస్తరించి ఉంది.ఏజెన్సీ ప్రాంతంలో పండే పసుపునకు స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంచి మార్కెట్‌ ఉంది. కొవిడ్‌ తర్వాత సరకు ఎగుమతులు తగ్గడంతో ధరలు తగ్గాయి. ఈ రెండేళ్లు ఈ పంట పండించిన రైతులు పెట్టుబడి సైతం రాక ఇక్కట్లకు గురయ్యారు. 2020-21లో పసుపు ధర రూ.50 ఉండగా.. ఈ ఏడాది జూన్‌, జులై నాటికి రూ.60 వరకు వెళ్లింది. ఆగస్టు చివరికి ఒక్కసారిగా రూ.110కు పెరిగింది. సరకు నిల్వ చేసుకున్న రైతులకు మంచి ఆదాయం సమకూరుతోంది.

[zombify_post]

Report

What do you think?

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాలో పర్యటన

దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జెడ్పి చైర్ పర్సన్ పూజలు