మండల పరిధిలోని పర్ణశాల గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సర్పంచ్ తెల్లం వరలక్ష్మి శంఖుస్థాపన చేశారు.గోవిందాపురం కాలనీలో గల కంగారు భద్రయ్య ఇంటి నుంచి ఎంపిటీసి తెల్లం భీమరాజు ఇంటి వరకు తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం తలపెట్టిన సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పదవి కాలంలో అభివృద్ధి పనులు చెయ్యడం ఆనందంగా ఉందన్నారు.పర్ణశాల పంచాయతీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాదర్ బాబు,వార్డు మెంబర్ సవలం జయమ్మ,కాంట్రాక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


