పనులు బందు చేసి ఆందోళన నిర్వహిస్తాం
రాజాం మున్సిపల్ కార్మికులకు సక్రమంగా హెల్త్ అలవెన్స్ లు పెట్టడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి మానుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్. రామ్మూర్తి నాయుడు హెచ్చరించారు. మంగళవారం రాజాం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులతో జరిగిన సమావేశంలో నినాదాలు చేసారు. పనులు బంద్ చేసి ఆందోళన నిర్వహిస్తామని మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమంలో హెచ్చరించారు.
[zombify_post]

