in , , ,

పటేల్ రమేష్ రెడ్డి విజయం కోసం పనిచేయాలి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందున,  తన విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

  • శనివారం నాడు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ ల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఓటరు జాబితా తుది దశకు చేరుకుందని, కాబట్టి బూత్ స్ధాయిలో ఓటరు నమోదు కు కాంగ్రెస్ పార్టీ బూత్ ఇంఛార్జ్ లు క్ర్రషి చేయాలని అన్నారు.
  • ప్రస్తుత ఓటరు జాబితాలు పరిశీలన చేసి, బూత్ లోని ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని, కాంగ్రెస్ పార్టీ  ప్రతి బూత్ నుండి అత్యధిక ఓట్లు పడే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు.
  • అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం వుందని ఆయన అన్నారు.ప్రతి ఒక్క నాయకుడు గ్రామాలలో పర్యటన చేయాలని, ప్రజలను కలిసి వారితో సత్సంబంధాలను కలిగి వుండాలని చెప్పారు. సెప్టెంబరు 17 వ తేదిన హైదరాబాదు లో  జరగనున్న సోనియా గాంధీ సభను విజయవంతం చేయాలని అన్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని అన్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని, పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తుందని, రెండు లక్షల ఉద్యోగాల భర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్,ధరావత్ వెంకన్న,వల్దాస్ దేవేందర్,వెలుగు వెంకన్న,పిల్లల రమేష్ నాయుడు, స్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

BREKING NEWS: బేగంపేట్ ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ నిలిపివేత..!

చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన తుప్పు : ప్రభుత్వ విప్ చిర్ల