in ,

నిరుపేదల పక్షపాతి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..జగిత్యాల అర్బన్ నుకపల్లి లో భు సేకరణ చేపట్టి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో 4000 ఇళ్లు కేటాయించారని, కేసీఆర్ ప్రభుత్వం పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఎంత మందికి పంపిణీ చేశారో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పాలన్నారు. ధర్మపురి లో సుమారు వెయ్యి ఎకరాల మిగులు భూమి ఉన్నా, మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితులకు భూమి పంపిణీ చేయలేదని విమర్శించారు.దళితుల భూమినీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. 2014 నుండి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంతమందికి ఇచ్చారో కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Harish

నర్సీపట్నంలో న్యాయవాదులు విధులు బహిష్కరణ

మంత్రి కొప్పుల ఈశ్వర్ చర్చకు సిద్ధమా..! -డిసిసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్