in

నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన ఎంపీ అనురాధ, ప్రభుత్వ విప్ చిర్ల

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : 

కొత్తపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మైదానంలో జరగనున్న నియోజకవర్గ స్థాయి అండర్-14 మరియు అండర్-17 స్కూల్ గేమ్స్ పోటీలను అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారుచెయ్యడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని, నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ లో భాగంగా కబడ్డీ, కోకో, వాలీబాల్, బాడ్మింటన్, టెన్నికోయిట్ వంటి క్రీడల పోటీలు జరుగుతాయని, ప్రతిభావంతులైన క్రీడాకారులు దేశప్రతిష్ఠను ప్రపంచపటంలో ఉన్నతంగా నిలపడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నారని, పాఠశాల నుండే విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటూ విద్యపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.క్రీడలు మనిషి శక్తిని ఉత్తేజపరచడంతో పాటూ, మనోరంజక సాధనాలలో ఒక భాగమై మానవులను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయడంలో దోహదపడతాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి సరదాగా ఆటలు ఆడి వారిని ఉత్తేజపరిచారు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి