నిద్రపోయిన యువతి అర్ధరాత్రి అదృశ్యం
సంతకవిటి మండలం హోంజరం గ్రామంలో యువతి అదృశ్యం అయినట్లు ఎస్ఐ బి. లోకేశ్వరరావు తెలిపారు. కొయ్యాన వరలక్ష్మి (18) అనే యువతి కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోయిన ఆమె గురువారం అర్ధరాత్రి నుంచి తల్లిదండ్రులకు కనపడలేదు. దీంతో ఆమె తండ్రి వంజయ్య చుట్టుపక్కల వెతికి, బంధువులకు కూడా సమాచారమిచ్చాడు. ఎక్కడ ఆమె జాడ కనపడలేదు. తండ్రి సంతకవిటి పోలీసుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
.
[zombify_post]

