నాలుగవ రోజు గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పిన్నెల్లి
మండల కేంద్రమైన రెంటచింతల లోని స్థానిక అంబేద్కర్ కాలనీ మరియు వై ఆర్ ఎస్ హై స్కూల్ దగ్గర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆశల కనుగుణంగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదన్నారు. ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ ఫలాలను పేదలకు అందించాలని దృక్పథంతో వైఎస్సార్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజల పుష్పవతి రామయ్య, ఎంపీపీ దాసరి చౌడేశ్వరి. ఉమా మహేశ్వర్ రెడ్డి మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు , పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు మండలంలోని సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


