నర్సింగ్ కళాశాల పూర్తి చేయాలి
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో 20 కోట్ల రూపాయల నిధులతో 5 ఎకరాల స్థలంలో 2016 లో నిర్మాణం ప్రారంభించిన నర్సింగ్ కళాశాల నిధులలేమి కారణంగా నేటికి కూడా పూర్తి కాలేదని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు. స్థానిక బిజెపి నాయకులతో కలిసి నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలను పరిశీలించారు. కళాశాల భవనం పూర్తి అయ్యిందని, హాస్టల్ భవనం, కేంటీన్, టాయిలెట్స్ ఇంకా పూర్తి కాలేదన్నారు.
[zombify_post]
