in

దివ్యంగులు ఓటరు నమోదు చేసుకోవాలి

కరీంనగర్ జిల్లా

దివ్యాంగులు  ఓటర్లు గా నమోదు చేసుకోవాలి

అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

.            0 0 0 0

జిల్లాలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులందరూ ఓటర్లుగా గుర్తించబడాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో  సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు నిర్వహించిన ఓటర్ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ అంగవైకల్యం, వృద్దాప్యం కేవలం శరీరానికి మాత్రమేనని, వీరు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే సకాలాంగులతో సమానమని అన్నారు.  జిల్లాలో దివ్యాంగులు, వృద్దులందరు ఓటర్లుగా నమోదు కాబడలాని అన్నారు. ఓటరు జాబితాను ప్రచురించి స్పెషల్ క్యాంపేన్ లను జిల్లాలో నిర్వహించడం జరిగిందని,  వీటి ద్వారా నూతన ఓటర్ల వివరాలు .నమోదు చేయడం, జాబితాలో మార్పులు చేర్పులను అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు.   ప్రతి పోలింగ్ కేందంలో దివ్యాంగులు, వృద్దుల కొరకు ర్యాంపులు, వీల్ చైర్లు మొదలగు ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం జరిగిందని  అన్నారు.  యువకుల కంటే ఎక్కువగా దివ్యాంగులు, వృద్దులే ఓటు హక్కును బాద్యతగా భావించి పట్టుదలతో ఓటు వేయడంలో ముందుంటారన్నారు.  అదే విధంగా మన కుటుంబంతో పాటు ఇంటి సమీపంలో 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువతి, యువకులను ఓటర్లుగా గుర్తించేలా చూడాలన్నారు.voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా స్వయంగా మొబైల్ లో ఓటర్ జాబితా  లో వివరాలను చూసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.  

 ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ కె. మహేశ్వర్, డిఆర్డిఓ శ్రీలతరెడ్డి, డిడబ్లుఓ సరస్వతి,స్వీప్ నోడల్ అధికారి బి.రవీందర్, రెడ్ క్రాస్ సోసైటి చైర్మన్  కేశవరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్యక్షులు మోసం అంజయ్య, డే కేర్ సెంటర్  ప్రెసిడెంట్ జనార్దన్ రావు తదితరులు పాల్గోన్నారు.

కరీంనగర్ జిల్లా

ధరణి లో దరఖాస్తు లు పెండింగ్ లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ డాః బి. గోపి
.            0 0 0 0 0

జిల్లాలోని ఏ మండలంలో కూడా ధరణి లో పెండింగ్ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో దరణి పెండింగ్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ డాః బి. గోపి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో దరణి  మాడ్యూల్స్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆ తరువాత చర్యలు తీసుకోవాలని,  పెండింగ్ ఉన్నట్లయితే వాటిని సమీక్షించి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.  దరణి రిజీస్ట్రేషన్ కొరకు దరఖాస్తులు వచ్చినప్పుడు మొదటగా ఫిజికల్ పోజిషన్ లో ఎవరు ఉన్నారు. వారికి భూమి పై హాక్కు ఏ విదంగా వచ్చింది, టైటిల్ పాస్ బుక్ లను పరిశీలించాలని, రిజిస్ట్రేషన్ ద్వారా భూమిపై హక్కును కలిగి ఉన్నట్లయితే అతనికి భూమి ఆమ్మె వ్యక్తికి హక్కు ఏవిధంగా వచ్చిందనే విషయాలను పరిశీలించాలన్నారు.  

 ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇంచార్జి డిఆర్ఓ పవన్, కలెక్టరేట్ ఏఓ సుధాకర్, సూపరింటెండెంట్ లు పాల్గోన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Rajendra

దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం*

కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం