in ,

తెలంగాణ సాయుధ పోరాట 75 వ వార్షికోత్సవం

తెలంగాణ సాయుధ పోరాట 75 వ వార్షికోత్సవం  సందర్భంగా నిర్మల్ జిల్లా సిపిఐ కార్యాలయంలో  జాతీయ పతాక ఆవిష్కరణ కా. యస్. విలాస్ సిపిఐ జిల్లా కార్యదర్శి చేశారు.
కా. యస్. విలాస్ మాట్లాడుతూ సిపిఐ నాయకులు కా. రావి నారాయణ రెడ్డి,మక్ధుం మెాహియెద్దిన్,బద్దం ఎల్లా రెడ్డి ల నాయకత్వం లో తెలంగాణ లో సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడంతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలి ఖాన్ బహదూర్ భారత ప్రభుత్వం వద్ద లొంగి పోయారు. హైదరాబాద్ రాష్రం  భారత్ లో విలీనం అయింది. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, నిజాం నవాబు కుట్ర లో భాగంగా పోలీసు ఆక్షన్ పేరిట 4000 కమ్యూనిస్టు లకు కాల్చి చంపడం జరిగింది. అప్పటి నిజాం హైదరాబాద్ రాష్ట్రం లో కనీస హక్కులకై  కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగించారు. అయ్యా నీ  బాంచనోళ్ళె బందూకులు పట్టారు. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. కేంద్రంలో ఉన్న బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రికరిస్తుంది. హిందూ ముస్లిం పోరాటంగా చెబుతున్నారు. సి. యం కేసిఆర్ ఉద్యమ సమయంలో సీమాంధ్ర వాళ్ళు అధికారికంగా నిర్వహించ లేదని అన్నారు. ఈ రోజు అధికారంలో వచ్చిన తరువాత, అధికారమే పరమావధిగా ఈ విషయాన్ని మరచి, నియంత్రుత్వ పరిపాలన సాగిస్తున్నారు. సిపిఐ డిమాండ్ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. కా. యస్. యన్. రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో కేసిఆర్ ప్రజలకుప్రజా స్వామ్య హక్కులు లేకుండా, బిజేపి దుష్ట పరిపాలనకు వంత పాడుతున్నదని  అన్నారు.
ెఈ కార్యక్రమంలో కా. భూక్య రమేష్, ఏఐవైఫ్ జిల్లా కన్వీనర్, కా. కైలాష్, ఏఐయస్ఎఫ్ జిల్లా కన్వీనర్, కా.జాదవ్ శంకర్, సిపిఐ సీనియర్ నాయకులు, కా. దుర్గే అనంత రావ్, డి హెచ్ పి యస్ జిల్లా కన్వీనర్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

నిశ్చితార్థ వేడుకకు హాజరైన పవార్ రామారావు పాటిల్ గారు…

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు