తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభను జయప్రదం చెయ్యాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం మండలంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..సెప్టెంబర్ 17వ తేదీన భద్రాచలం పట్నంలో జరిగే వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభను జయప్రదం చేయాలన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని తెలిపారు.సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, సారపాక లో బ్రిడ్జి నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు, కొంతమంది వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో పాల్గొనని బిజెపి పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇది వీలినామ దినం కాదు అని విమోచన దినమని చరిత్రను వక్రీకరిస్తూ బిజెపి నాయకులకు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని ఆయన గుర్తు చేశారు, ఈ ఉద్యమం దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందని అన్నారు నిజం రజాకారులను జాకీర్దారులను తరిమికొట్టిన రోజు హాని ఆయన గుర్తు చేశారు, ఉద్యమంలో 3,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు అమరులు అయ్యారని పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు 10 లక్షల ఎకరాలు భూమి పంచిన ఘనత కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో భద్రాచలం నియోజవర్గంలో సిపిఎం పార్టీ గెలుపు ఖాయమని ప్రతి యొక్క కార్యకర్త గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు మాజీ డిసిసి చైర్మన్ యలమంచి రవికుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, యాస నరేష్, నిమ్మల మధు,సోయం వీరాజ్, బొల్లి సత్యనారాయణ, సరియం ప్రసాద్, కొమరం చంటి, మడకం మహేంద్ర నాథ్, ఇంకా తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


