-
ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపాం అంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
-
మంత్రి కామెంట్
-
ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధం
-
శతాబ్ది కాలంలోనే ఇది అతిపెద్ద అబద్ధం
-
తీసుకున్న రుణాలుతిరిగి చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-
ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, ఇచ్చే ఆర్డిక సంస్థలను బయపెడుతున్న దుర్మార్గం ఆర్ కె సింగ్, కేంద్ర ప్రభుత్వాలదే
-
కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసే పనులతో దేశానికి తీరని ద్రోహం
-
తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పలేదని కేంద్ర విధ్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధం
-
మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నామని కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రజల ముందు ఉంచాం
-
దేశంలో మిగులు విద్యుత్ ఉన్నదనేది పెద్ద జోక్
-
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఉన్న కరెంట్ కోతలే ఆర్కే సింగ్ అసత్యపు వ్యాఖ్యలకు నిదర్శనం
-
కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం
-
రాత్రిపూట కరెంటు వాడితే సర్ ఛార్జ్ విధిస్తామని కేంద్ర మంత్రి హోదాలో ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా?
-
తెలంగాణలో బిజెపికి దిక్కు లేదనే అక్కసు తోనే ఆర్కే సింగ్ వ్యాఖ్యలు
-
ఇట్లనే మాట్లాడితే పైసలు ఇవ్వమంటూ భయపెట్టే ధోరణిలో ఆర్కే సింగ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మర్చిపోదు
-
వాటా ఇవ్వకపోవడానికి తెలంగాణ ఆర్కే సింగ్ జాగిరి కాదు..
-
అది తెలంగాణ ప్రజల హక్కు..
-
చెల్లించిన పన్నులే అడుగుతున్నాం
-
ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసిఆర్ లక్షయశుద్ధిని ఆపలేరు
-
కెసిఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కోసం బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ తోనే బిజెపి పెద్దలకు అక్కసు
-
ఎన్ని ఆటంకాలు సృష్టించినా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతాం
-
అబద్దాలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు
-
అబద్ధాలు చెప్పే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు
హైదరాబాద్
ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపాం అంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు . ఈ వ్యాఖ్యలు శతాబ్దికాలం లోనే అతి పెద్ద అబద్దం అన్నారు.ఎర్రగడ్డలోని జెన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి
తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని తాము చెప్పలేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నామని కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రజల ముందు ఉంచాం అన్నారు.కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసే పనులతో దేశానికి తీరని ద్రోహం జరుగుతుందన్నారు.తీసుకున్న రుణాలుతిరిగి చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న మంత్రి, దమ్ముంటే ఏ ఒక్క సంస్థ దగ్గరైనా పేమెంట్ ఆలస్యమైందో ఆర్కే సింగ్ చూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, రాష్ట్ర పేమెంట్ విధానానికి ముగ్గులై రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆర్డిక సంస్థలనుఇవ్వకుండా బయపెడుతున్న దుర్మార్గం ఆర్ కె సింగ్, కేంద్ర ప్రభుత్వాలదే అని ఆరోపించారు. కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మాకు సైతం కావాలంటూ బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ తోనే బిజెపి నాయకులు అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసిఆర్ లక్షయశుద్ధిని ఆపలేరని దుయ్యబట్టారు.
ఇట్లనే మాట్లాడితే పైసలు ఇవ్వమంటూ భయపెట్టే ధోరణిలో ఆర్కే సింగ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు.
వాటా ఇవ్వకపోవడానికి తెలంగాణ ఆర్కే సింగ్ జాగిరు కాదన్న మంత్రి,అది తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులే అడుగుతున్నాం తప్పా కొత్తగా అడగట్లేదు అన్నారు.
తెలంగాణలో బిజెపికి దిక్కు లేదనే అక్కసు తోనే ఆర్కే సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.దేశంలో మిగులు విద్యుత్ ఉన్నదనేది పెద్ద జోక్ అన్నారు. మిగులు విద్యుత్ ఉంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.రాత్రిపూట కరెంటు వాడితే 25 శాతం సర్ ఛార్జ్ విధిస్తామని కేంద్ర మంత్రి హోదాలో ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా? అంటూ ఫైర్ అయ్యారు.
కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం అన్న మంత్రి శతాబ్ది కాలంలోనే ఇది అతిపెద్ద అబద్ధం ఆన్నారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతాం అన్నారు.
అబద్దాలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్న మంత్రి జగదీష్ రెడ్డి,
అబద్ధాలు చెప్పే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు.
[zombify_post]


