in ,

తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

తిరుమల: కడప జిల్లాకు చెందిన భక్తుడు రాజారెడ్డి తిరుమల శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహూకరించారు. ఈ బంగారు పుష్పాలను లలితా జ్యూవెలరీ కంపెనీ తయారు చేసినట్టు ఆ కంపెనీ అధినేత కిరణ్‌ కుమార్‌ తెలిపారు..దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పుష్పాలను తయారు చేసినట్టు వెల్లడించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న రాజారెడ్డి, కిరణ్‌ కుమార్‌ స్వామివారికి బంగారు పుష్పాలను సమర్పించారు. ఈ బంగారు పుష్పాలను శ్రీవారి అష్టదళపాదపద్మారాధన సేవకు వినియోగించనున్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

జి 20 సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన నటరాజ ప్రతిమ…