– కాంగ్రెస్ ఆశావాహులకు వారంలో తీపి కబురు
నేతల్లో టెన్షన్.. టెన్షన్
కాంగ్రెస్ అభ్యర్థుల స్కీనింగ్ లిస్ట్ ఢిల్లీకి చేరడంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. లిస్టులో ఎవరి పేరు ఉన్నదో.. ఎంతమంది పేర్లు రికమండ్ చేశారో వివరాలు బయటకు రాకపోవటంతో ఎవరికివారు నాకే టిక్కెట్ అంటూ అనుచరులను నమ్మించే పనిలో పడ్డారు. సత్తుపల్లి టిక్కెట్ ఆశిస్తూ ఆరుగురు పీసీసీకి దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఇందులో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఆశీస్సులతో వైద్యులు మట్టా దయానంద్, రాగమయి దంపతులు దరఖాస్తు చేసుకోగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కొండూరి సుధాకర్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖరరావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ రేసులో ఉన్నారు. వీళ్లంతా టిక్కెట్ కోసం హై లెవెల్ పైరవీ ప్రారంభించినట్లు తెలుస్తుంది. సర్వే ప్రకారం సీట్ల కేటాయింపు అంటూ ఒకవైపు అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసింది.. మరోవైపు ఎవరికి తోచిన విధంగా వారు పైరవీలు ప్రారంభించినట్లుగా పార్టీ శ్రేణుల సమాచారం. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారుల పూర్వపరాలు, కాంగ్రెస్ లో వారి చరిత్ర, స్తోమత, సర్వీస్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ లిస్టు సిద్ధం చేసి తాజాగా ఏఐసిసి ఆమోదంకు పంపినట్లుగా తెలిసింది. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ఏఐసిసికి వెళ్లిన పేర్లు తెలియకపోవటంతో ఎవరికివారు నాకే టికెట్ అంటూ భుజం తడుముకునే పనిలో కనిపిస్తున్నారు. మరో వైపు వారి గాడ్ ఫాదర్లను ఉరుకులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు ఇప్ప టికే ఎలక్షన్ పనుల్లోకి దిగిపోగా కాంగ్రెస్ మాత్రం ఇంకా నాన్చుడి ధోరణిలో కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో అసంతృప్తి వాదుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా స్కీన్ లిస్టు ఢిల్లీకి చేరడంతో ఆశవాహల్లో తీవ్ర మైన ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థుల పేర్లు ప్రకటించ డానికి ఇంకా వారం పడుతుందనే విషయం తెలుస్తుంది.
[zombify_post]


