in ,

టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా: చంద్రబాబు

గుత్తి: సైకో జగన్‌కు పోలీసులు, ధన బలం ఉండొచ్చు.. ఆ బలం కంటే మిన్నగా ప్రజాబలం తన సొంతమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 'బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తెదేపా శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోరాటం తన కోసం కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమేనన్నారు. చేయి చేయి కలుపుదాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.

'' ఒక్క ఛాన్స్‌ అని మోసపోయాం.. అరాచక పాలన పోవాలి. ఇచ్చేది పది రూపాయలు.. దోచేది వంద రూపాయలు. ఇసుక ధరలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించారు. యువగళం ప్రజాగళం.. ప్రజా ఉద్యమంగా మారింది. యువగళం వాలంటీర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. అయినా, వెనక్కి తగ్గేది లేదు.. పోరాటం కొనసాగిస్తాం. వ్యాపార కేంద్రమైన గుంతకల్లు పూర్వవైభవం కోల్పోయింది. గుత్తి చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. తెదేపా హయాంలో హంద్రీనీవా జలాలు తీసుకువచ్చాం. గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించి కియా పరిశ్రమ తెచ్చాం. పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. సంపద సృష్టించే బాధ్యత.. పంచే బాధ్యత నాది. టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. ఇదే 'బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ'' అని చంద్రబాబు వివరించారు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

దిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో జీ20 ఏర్పాట్లపై సమీక్ష!

కేసీఆర్ ను కలిసిన మేఘాలయ సీఎం