#AP_CM_Y
కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా: రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అధ్యక్షతన శనివారం కొవ్వూరు నియోజకవర్గంలోని జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు (జేసీఎస్), నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్పీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హోంమంత్రి దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి చేపట్టిన ఈ నాలుగేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తూ.. జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు నినదించేలా పరిపాలన అందించారన్నారు. జగనన్న ప్రభుత్వంలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. పేదలకు ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు అందించడం, పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సహా నాడు నేడు పథకంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. రేషన్ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్‌ల వరకూ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఇంటి ముంగిటే అందిస్తున్నామన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కలను సాకారం చేస్తూ.. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం.. ఇది దేశంలోనే ఒక చరిత్ర అని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తోందని తెలిపారు. గతంలోలా ప్రభుత్వాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సంప్రదాయానికి స్వస్తి పలికి అవినీతికి లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నామన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇంటి స్థలాలను మహిళల పేరు మీదనే ఇచ్చామని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినెటెడ్ పనుల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ బిల్లును తీసుకొచ్చామన్నారు. గత ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి రికార్డు సృష్టించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మార్చిన విజయ పరంపరను భవిష్యత్ లో కూడా కొనసాగించాలని కోరారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి గుంపులు, గుంపులుగా వస్తున్నా.. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి గానూ 175 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమనిపిస్తోందని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తుచేస్తూ.. ఎవరు, ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని హోంమంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!