in

ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు తావు లేదు: ఎస్పీ ఎస్. శ్రీధర్

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో వున్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతి లేదని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ  జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. శ్రీధర్ తెలిపారు.

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కు ఏ.సి.బి కోర్టు రిమాండ్ విధించిన మేరకు టిడిపి పార్టీ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు,ధర్నాలకు అనుమతి లేదన్నారు. 

పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ప్రజల సాధారణ జన జీవనం రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు

ఖైదీ నెంబర్ 7691