in ,

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో సెప్టెంబర్ 9 వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశం ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం  న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు. లోక్ అదాలత్ లో పరిష్కారమైన కేసులు అప్పిలు కు అవకాశం లేని అంతిమ తీర్పు అని అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కాంపౌండబల్ కేసులు, సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు చిట్ పన్డ్ కేసులు,భూతగాదాలు కు సంబంధించిన కేసులు వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగతనం కేసులు, బ్యాంకు ప్రి -లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Suresh

అపర భగీరథుడు.ముఖ్యమంత్రి కేసిఆర్ – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన మంత్రి అల్లోల…