in , , ,

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి

  • జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి.

  • టీయూడబ్ల్యూజె ఐజెయూ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు.

సూర్యాపేట జిల్లాలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బంటు కృష్ణ గౌడ్, అక్రిడేషన్ కమిటీ  సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు కోరారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన యూనియన్ ముఖ్య నేతల సమావేశంలో వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు కెసిఆర్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని వారిని గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. డెస్క్ జనరేషన్లకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో త్వరలో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని సూర్యాపేట, హుజూర్ నగర్ ,కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం యూనియన్ ను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ రావు, కార్యదర్శి విజయ్ కుమార్, రవికుమార్, వీరయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన ఎంపీ అనురాధ, ప్రభుత్వ విప్ చిర్ల

ONGC సౌజన్యంతో కుట్టుమిషన్లు పంపిణీ