చర్ల మండలంలో మొగళ్లపల్లి నుంచి జిపి పల్లి వెళ్లే రహదారి ఆధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడ గుంతలతో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి. పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడటం ఖాయమని వారంతా వాపోతున్నారు. చెరువుల ఉండటంతో అటుగా రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని భయాందోళన చెందుతున్నారు. తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఈ రోడ్డు మీదిగా వాహనాలు వచ్చిపోతుంటాయి. ఆ సమయంలో నీరు చింది పడి తమ దుస్తులు పాడవుతున్నాయని బాటసారులు వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా నిర్వహణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ రహదారి మరింత ఆధ్వానంగా ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
[zombify_post]
 
					
 
			
			 
			
					
