*చెన్నమనేని రమేష్ గారికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు!*
*మంత్రి కేటీఆర్ గారిని కలసిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని!*
*నియోజకవర్గంలోని అభివృద్ది పనులు, పెండింగ్ పనులు, అనుమతులపై చర్చ!*
నేడు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు ముఖ్య మంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించిన తరువాత అమెరికా, దుబాయ్ దేశాల నుండి రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి వచ్చిన బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు రావు గారిని నేటి సాయంత్రం సచివాలయంలో కలిసి వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, పనుల పురోగతి, పెండింగ్ పనుల అనుమతులు, దేవాలయ అభివృద్ది, కలికోట సూరమ్మ చెరువు, మిగిలి వున్న ముంపు గ్రామాల సమస్యలు, ప్రధాన మైన రోడ్లు, బ్రిడ్జీల అనుమతులు, పరిపాలన సౌలభ్యం కోసం కొనారావు పేట, కథలాపూర్, మన్నేగూడెం మండలాల ఏర్పాటు మొదలగువాటిపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారులుగా నియమితులైన రమేష్ గారికి మంత్రి వర్యులు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గురుతరమైన బాధ్యత అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇందుకు సహకరించిన జిల్లా స్థానిక మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ సందర్భంగా చెన్నమనేని రమేష్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన ఈ బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా రమేష్ గారు తెలిపారు.
[zombify_post]


