in , , ,

చర్ల మండలంలో డెంగ్యూ పంజా

భద్రాద్రి జిల్లా చర్ల మండల పరిధిలోని గోమ్ముగూడెం, కొత్తపల్లి, లింగాపురం, కొత్తూరు, వివిధ గ్రామంలో విషజ్వరాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఇద్దరు నుండి నాలుగురు వరకు విషజ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో ఇంత జరుగుతున్న ప్రభుత్వ వైద్యుల జడలేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో కొందరు భద్రాచలం వెళ్ళి ప్రైవేట్ వైద్యం చేయించుకుంటుండగా మరికొందరు గ్రామంలోని గ్రామీణ వైద్యుల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామంలో డెంగ్యూ తో పాటు టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో డెంగ్యూ, టైఫాయిడ్ ప్రతి ఇంట్లో ముగ్గురు నుంచి నాలుగు ఉన్నట్టు కొంత మందికి జ్వరం తగ్గిన ఒళ్ళునొప్పులు, నీరసంతో బాధపడ్తున్నారాని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు సత్వరమే స్పందించి వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

చంద్రబాబు అరెస్ట్ తెలుగు తమ్ముళ్లు రెస్ట్

ఆశ కార్యకర్తల అరెస్ట్