డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా అక్రమ అరెస్టుయిన చంద్రబాబునాయుడు నిర్దోషిగా తిరిగి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సామూహిక రిలే నిరాహారదీక్షలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ దీక్షకు మాజీ ఎంపి అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు అమలాపురం పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ గంటి హరీష్ మాధూర్ సంఘీభావం తెలియజేశారు.ఈ సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నిరాహారదీక్షలు చేపడుతున్నామని మొదటిరోజు ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో దీక్షలో పాల్గొన్నారని అన్నారు.ఆధారాలు లేకుండా తప్పుడు కేసులతో అధికారం వినియోగించి చంద్రబాబునాయుడుని అరెస్టు చేసి రిమాండుకు పంపడం కక్ష సాధింపు చర్యలే అని అన్నారు.విశ్రాంత ఐఏయస్ పి.వి రమేష్, డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ లు కూడా స్కిల్ డవలప్మెంట్ లో ఏ విధమైన అవకతవకలు జరగలేదని బహిరంగా చెప్తున్నారని అన్నారు.చంద్రబాబునాయుడు మీద అవినీతి మరక వేయాలని ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసి రిమాండ్ కు పంపారని తెలిపారు.పి.వీ రమేష్,ఖాన్ ల లేఖలను పరిధిలోకి తీసుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానని సత్యానందరావు అన్నారు.తండ్రి అక్రమ అరెస్టుతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీ శ్రేణులంతా అండగా వుండాలని కోరారు.కలసి పోరాడి చంద్రబాబునాయుడుని నిర్దోషిగా తీసుకువచ్చేంత వరకూ మన పోరాటం కొనసాగించాలని సత్యానందరావు పిలుపునిచ్చారు.
ఈ దీక్షకు ఆత్రేయపురం మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఆలమూరు, కొత్తపేట, రావులపాలెం నాయకులు వచ్చి సంఘీభావం తెలియజేశారు.
[zombify_post]


