in ,

చంద్రబాబు ఆరోగ్యం పై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన

  • రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఆయన దోమలతో ఇబ్బంది పడుతున్నారని ములాఖత్‌ అనంతరం కుటుంబ సభ్యులు, తెదేపా కీలక నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అదే జైలులో రిమాండ్‌లో ఉన్న 19 ఏళ్ల యువకుడు డెంగీ, టైఫాయిడ్‌ ఇతర ఆరోగ్య సమస్యలతో మృతిచెందడంతో జైల్లోని పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ(19)ను ఓ కేసులో ఈ నెల 6న రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఆరోగ్య సమస్యల కారణంగా జైలు అధికారులు ఈనెల 7న అతడిని స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15న అతనికి డెంగీ అని తేలింది.. పరిస్థితి విషమించడంతో 18న అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ 20న తెల్లవారుజామున సత్యనారాయణ మృతిచెందాడు. ఈ ఘటనతో తెదేపా శిబిరం కలవరపడుతోంది. చంద్రబాబు కంటే నాలుగు రోజుల ముందే రిమాండ్‌ ఖైదీగా వచ్చిన యువకుడు డెంగీ సోకి మృతిచెందడంతో అక్కడున్న చంద్రబాబుతోపాటు మిగిలిన ఖైదీల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా చర్ల లో వెలసిన కరపత్రాలు

సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు