in ,

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

అమరావతి:సెప్టెంబర్ 09
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌ని గానీ, గవర్నర్ కార్యాలయంలో గానీ సీఐడీ అధికారులు  సంప్రదించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి.

2018లో చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే.కానీ, ప్రస్తుత గవర్నర్, 2021లో కేసు నమోదు చేసినప్పుడు ఉన్న గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం.

ఈ రోజు చంద్రబాబును అరెస్టు చేసిన వ్యవహారం కూడా గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని వర్గాలు పేర్కొన్నాయి…

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన తుప్పు : ప్రభుత్వ విప్ చిర్ల

చంద్రబాబు అరెస్టు కు నిదర్శనంగా రేపు పాడేరు మన్యం బంద్