టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరశిస్తూ ఆదివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం వంట్లమామాడిలో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్థానిక నాయకుడు ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, చంద్రబాబు ను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. టీడీపీ ఆందోళన లో కొద్దిసేపు వారపుసంతకు అంతరాయం ఏర్పడింది. అలాగే పాడేరు – చోడవరం మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.
[zombify_post]


