టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కు నిరశనగా ఆదివారం పాడేరు మన్యఝ బంద్ చేపడుతున్నట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. సీఎం జగన్ కేవలం రాజకీయ కక్ష సాధింపుకే చంద్రబాబు ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకులు, వ్యవస్థలను సీఎం జగన్ ఈ విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. చంద్రబాబు అరెస్టు కావడంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సంబరాలు జరుపుకోవడం దారుణమన్నారు. సంబరాలు మాని ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. రేపు జరిగే మన్యం బంద్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
[zombify_post]


