చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి అశోక్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై రేప్ కేసు మినహాయించి మిగిలిన సెక్షన్లు అన్ని బనాయించటం దారుణం అన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అనే సమాధానం కూడా పోలీసులు చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనం అన్నారు ఆయన. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే తీరు ఇదా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
ఈ విషయం ప్రజలందరూ గమనించాలని ఈ రాక్షసులు నుంచి ఆంధ్రప్రదేశ్ కాపాడాలని ప్రజలకు సూచించారు
[zombify_post]

