in , ,

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, ప్రజలకు సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  అప్పటి ఉద్యమనేత, ఇప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సారధ్యంలో  14 సంవత్సరాలు  కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం…. సాగునీటి, వ్యవసాయ, విద్య, వైద్యం రంగాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

రానున్నాయి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం విద్య వైద్యం, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో నంబర్ వన్ గా నిలవడం ఖాయమన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

గోమ‌య గ‌ణేష్ ప్ర‌తిమల‌ను పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి మంత్రి అల్లోల….