గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
నందిగాం మండలం సుభద్రాపురం గ్రామంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఎస్. చిన్నమ్మి (65) అనే వృద్ధురాలు శనివారం ఉదయం రోడ్డు దాటుతున్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నేషనల్ హైవే సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[zombify_post]

