in , ,

గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి

– భూ ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు

– ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి  కె. మోహన్ రావు,  గిరిజన సంఘం జిల్లా నాయకులు సవర.ధర్మారావు

 కమన్ మ్యాన్ న్యూస్, పలాస నియోజకవర్గం :

గిరిజనుల భూములకు వారి తోటలకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్ రావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు సవర .ధర్మారావు పాల్గొన్న డిమాండ్ చేశారు .ఆదివారం మందస మండలంలోని చాపరాయ కాలనీ లో పర్యటించి  గిరిజనుల భూములని ఆక్రమించి,తొలగించిన టేకు చెట్లను  పరిశీలించారు. తరతరాలుగా గిరిజనుల సాగులో ఉన్న వారి జిరాయతి భూములను, వారు వేసుకున్న తోటలను ,టేకు చెట్లను గిరిజనేతరులు  గిరిజనులపై దాడి చేసి బలవంతంగా చెట్లను తొలగించి తీసుకుపోవడం అన్యాయమని మండిపడ్డారు.గిరిజనులకు అన్ని రకాల హక్కు పత్రాలు ఉన్నప్పటికీ  రాజకీయ నాయకుల అండతో గిరిజనుల తోటలోని టేకు చెట్లను తొలగించి అడ్డుకున్న గిరిజనులపై కులం పేరుతో దూషించడమే కాకుండా గిరిజన మహిళలపై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని వారన్నారు .ఈ విషయం అధికారులకు  తెలియజేసినప్పటికీ వారి నుండి  ఎటువంటి స్పందన లేదని ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు.మందస ప్రాంతంలో గత కొంతకాలంగా గిరిజనులపై దాడులు చేసి గిరిజనుల భూములను ఆక్రమించుకోవడం తప్పుడు పత్రాలు సృష్టించి కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు.కొంతమంది నాయకుల అండతో జరుగుతున్న ఈ అరాచకాన్ని ప్రభుత్వము, అధికారులు పరిశీలించి గిరిజనుల భూములకు పంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు .తమ హక్కుల కోసం గిరిజనుల చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ మద్దతును తెలియజేశారు. భూ ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని గిరిజన భూములు వారికి దక్కేవరకు ప్రజలందరినీ కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సవర .జయరాజ్ ,సవర. బాలకృష్ణ, సవర .జగ్గారావు, తిరుపతి,రామారావు, జ్వరాడు, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

నందిగామ గాంధీ సెంటర్లో టిడిపి నాయకుల నిరసన

రేపటి నుంచి పర్యాటక ప్రాంతం మూసివేత