in ,

గిరిజ‌నుల‌కు ప్ర‌భుత్వ సేవ‌లందించ‌డ‌మే ల‌క్ష్యం జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ ఆదేశం

పాడేరు, అల్లూరి జిల్లా: గిరిజనుల‌కు  ప్ర‌భుత్వ సేవ‌లందించ‌డ‌మే స‌చివాల‌యం సిబ్బంది ల‌క్ష్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ స్ప‌ష్టం చేసారు.   జిల్లా లోని ఎంపిడి ఓలు, ఉపాధిహామీ అధికారులు,  మండ‌ల విద్యాశాఖాధికారుల‌తో  సోమ‌వారం సాయంత్రం ఆయ‌న కార్యాల‌యం నుండి  వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఉపాధి హామీ జాబ్ కార్డులు జారీ,  ఆర్ ఓ ఎఫ్  ఆర్ భూముల‌కు ఉపాధిహామీ ప‌థ‌కంతో అనుసంధానం, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల  హాజ‌రు నివేధిక‌లు,  జ‌న‌న  దృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీ,  ఆధార్ కేంద్రాలు నిర్వ‌హ‌ణ‌పై  సంబంధిత అధికారుల‌తో  స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉపాధిహామీ జాబ్ కార్డుదారుల‌కు పెద్ద ఎత్తున ప‌నులు క‌ల్పించాల‌ని చెప్పారు. ఏకార‌ణాల  చేత‌నైనా జాబ్ కార్డు తొల‌గిస్తే  తిరిగి జాబ్ కార్డులు జారీ చేయాల‌ని సూచించారు. జిల్లాలో 12500 మందికి జ‌న‌న దృవీక‌ర‌ణ ప‌త్రాలు పంపిణీ చేయాల్సి ఉంద‌న్నారు. జ‌గ‌న‌న్న  ఆరోగ్య సుర‌క్ష స‌మ‌ర్ద‌వంతంగా అమ‌లు చేయ‌డానికి  ఎ ఎన్ ఎంల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఎ ఎన్ ఎంలు గ్రామాల్లో ప‌ర్య‌టించి  వ్యాదుల‌ను గుర్తించాల‌ని అన్నారు.   ఆధార్ లేని వారంద‌ర‌కి ఆధార్ కార్డులు జారీ చేయాల‌న్నారు. ఆధార్ కేంద్రంలో ప్ర‌తీ రోజు 25 మందికి సేవ‌లందించాల‌ని  ఆదేశించారు. ఆమేర‌కు ఆధార్ సేవ‌లు అందించ‌క‌పోతే ఆధార్ కేంద్రాన్ని మ‌రో చోట‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. డిజిట‌ల్ అసిస్టెంట్ల వ‌ద్ద ఉన్నప్ర‌భుత్వ డ‌బ్బును స‌కాలంలో ప్ర‌భుత్వానికి   జ‌మ చేయాల‌ని  స్ప‌ష్టం చేసారు.  ప్ర‌భుత్వానికి స‌క్ర‌మంగా జ‌మ చేయ‌క‌పోతే  డిజిట‌ల్ అసిస్టెంట్ల పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. చింతూరు, దేవీప‌ట్నం, జి.కె. వీధి,మారేడుమిల్లి, ఎట‌పాక‌, పెద‌బ‌య‌లు, వై.రామ వ‌రం మండ‌లాల ఎంపిడి ఓలు  పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల అటెండెన్స్ స‌మ‌ర్పించ‌డం లేద‌ని  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.
ఈ స‌మావేశంలో  డి ఎల్  డి ఓ  శాంత‌ల‌క్ష్మి, జిల్లా పంచాయ‌తీ అధికారి  కొండ‌ల రావు, డివిజ‌న‌ల్ పంచాయ‌తీ  అధికారి పి ఎస్ కుమార్‌,  ఉపాధిహామీ ఎపిడి జె. గిరిబాబు,  గ్రామ వార్డు స‌చివాల‌యాల కో ఆర్డినేట‌ర్  సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

[zombify_post]

Report

What do you think?

సాగునీటి వనరులు అభివృద్ధికి నోచుకొనేనా…?

Common news