గర్భిణులు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని వైస్ చైర్మన్ సముద్రపు రామారావు అన్నారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో సోమవారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సముద్రపు రామారావు గర్భిణులు, చిన్నారులు రక్తహీనత లోపం రాకుండా విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు.
[zombify_post]
