in

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమే ధ్యేయంగా వై.యస్.ఆర్.సంపూర్ణ పోషణ పథకం

గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హల్ నందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్ట్యా మరియు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టాలనే ఆలోచనతో, పేద వర్గాల మహిళలు పౌష్టికాహార లోపాలతో ఇబ్బందులు పడకూడదు అనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందచేసి, 6 నెలల శిశువులకు సామూహిక అన్నప్రాసన చేశారు.

వై.యస్.ఆర్.సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం,

2 కేజీల రాగిపిండి,

25 కోడి గుడ్లు,

5 లీటర్ల పాలు,

1 కేజీ కందిపప్పు,

1 కేజీ అటుకులు,

అరలీటర్ వంటనూనె,

250 గ్రాముల బెల్లం,

250 గ్రాముల వేరుశెనగ చిక్కి,

250 గ్రాముల ఖర్జూరం అందించడం జరుగుతుంది అని గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమే ధ్యేయంగా ఇవన్నీ అందిస్తున్నారని, ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడకుండా అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని తెలియచేశారు.

అంతా ఆయురారోగ్యాలతో పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. 

అనంతరం అంగన్ వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను పరిశీలించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

జొన్నాడ లో గుర్తు తెలియని తెలియని వ్యక్తి మృతి.

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి..?