భద్రాచలం పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.పట్టణంలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు ఏఎస్పీ భద్రాచలం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు.ఇందులో భాగంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సమావేశంలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరగడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ, నిబంధనల గురించి తగు సూచనలు,సలహాలు సూచించడం జరుగుతుందని తెలిపారు.ఉత్సవ కమిటీ నుండి కనీసం ఇద్దరు సభ్యులు ఈ సమావేశానికి హాజరు అవ్వాలని కోరారు..
[zombify_post]

