in

గణనాధుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి-డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ అయిన వినాయక చవితి పురస్కారించుకొని పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజున వినాయక చవితిగా జరుపుకోవడం అదృష్టంగా బావించి,భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అయిన సందర్భంగా  డా బిఆర్ అంబేద్కర్ కొనసిమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు గ్రామములో పసుపులేటి గూడెం నందు కొలువైన గణనాధుని భక్తీ శ్రద్ధలతో ప్రత్యెక పూజలు నిర్వహించారు పిఠాపురం నియోజక వర్గ పరిశీలికులు, వైఎస్ఆర్ పార్టీ సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతికి హాని కలిగించే రంగులు, ప్లాస్టరాఫ్ పారిస్, ఇనుము వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలను పూజించడం మంచిది కాదనీ. ఒకరిని మించి మరొకరు పోటీగా విగ్రహాల ఎత్తు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవడమొక దుష్ట సంస్కృతి అని, ఇతరులకు ఇబ్బంది కలుగకుండ ప్రతి ఒక్కరూ వినాయకుని పూజించాలని, ఆలమూరు గ్రామం ఆ గణనాధుని చల్లని అనుగ్రహం తో సుఃఖా సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు.అనంతరం పసుపులేటి గూడెం నందు ఏర్పాటు చేసిన గణనాధుని మండపంనకు  తన వంతుగా 10000 రూపాయలు మరియు ఎర్రకలని (చిర్ల జగ్గిరెడ్డి మోడల్ కాలనీ) నందు ఏర్పాటు చేసిన మండపం కమిటీ వారికి 10000 రూపాయిల విరాళం అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలమూరు ఉప సర్పంచ్ చల్లా లక్ష్మి భూషణం , శ్రీ కృషణదేవరాయలు కాపు సంఘం అద్యక్ష్యులు , పి ఎ సి మెంబర్ చల్లా నానాజీ,వార్డు మెంబర్లు లంకె వెంకట రెడ్డి, ఏరుకొండ గణేష్, ఎలుగుబంట్ల భూరయ్య, తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శనాలు పెంచిన ప్రభుత్వం

కుమారుడికి కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చిన తల్లి.