in , ,

కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండల పరిధి దబ్బనుతల కొత్తూరు గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న దుమ్ముగూడెం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పోలీసులు వస్తున్నారనే విషయాన్ని గమనించిన కొందరు  పందెం రాయుళ్లు పరారయ్యారు,2 వేలు నగదుతో పాటు 10 మోటార్ సైకిళ్ళు,1 కారు,5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెచ్ సి కృష్ణారావు,హెచ్ సి రమేష్,పిసి లు శంకర్, నరేష్,రాజేష్,పృథ్వి మరియు స్పెషల్ పార్టీ వారు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

చంద్రబాబు అరెస్ట్ తో జాతీయ రహదారిపై నిరసనలు

ఈరోజు 819 కేసులు పరిష్కారం”