వచ్చే నెలలో కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేద్దామని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు.వచ్చే నెలలో కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేద్దామని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవదాయశాఖ అధికారులు సూచనల మేరకు అన్నప్రసాదం, ఉత్సవాలకు సంబంధించి వేర్వేరుగా
ఏటా మాదిరిగానే ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సబ్కలెక్టరు నూరుల్కమర్ మాట్లాడుతూ అమ్మవారి వైభవానికి తగ్గట్లు ఉత్సవాల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు తమ అభిప్రాయాలు తెలిపారు. కౌన్సిలర్ వెలమల మన్మథరావు పలు సూచనలు చేశారు. డీఎస్పీ జీవీ కృష్ణారావు మాట్లాడుతూ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాక | సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక నిర్ణయిస్తామన్నారు. కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు, సీఐ మురళీధర్, దేవదాయ శాఖ మేనేజరు వెంకటరమణ, ఈవో మురళీకృష్ణ, ఎంపీపీ బి.భాను పాల్గొన్నారు.
[zombify_post]
