in ,

కొడాలినాని, పార్థసారధి, వంగవీటి రాధాకు అరెస్టు వారెంట్‌ జారీ

విజయవాడ: వైకాపా ఎమ్మెల్యేలకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వైకాపా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, ప్రస్తుత తెదేపా నేత వంగవీటి రాధాకు అరెస్టు వారెంట్‌ జారీ అయ్యాయి..

ప్రత్యేక హోదా కోరుతూ 2015లో విజయవాడ బస్టాండ్‌ ఎదుట వైకాపా నేతలు ధర్నా చేశారు. ఆందోళనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న పార్థ సారధి, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణలు విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు రక్షణ లేదు: చినరాజప్ప